Index/te
ఆగస్టు 26-28, 2009
పాల్గొనడానికి పిలుపు విడుదలయ్యింది! ఆగస్టు 26-28, 2009 తేదీలలో బ్యూనోస్ ఏరీస్, అర్జెంటీనాలో జరగనున్న వికీమీడియా ఫౌండేషన్ యొక్క 5వ అంతర్జాతీయ సదస్సు వికీమేనియా 2009 యొక్క అధికారిక సైటుకి స్వాగతం. ఇది మొదటగా దక్షిణార్థగోళంలో స్పానిష్ భాషలో జరుగుతుంది. బహుభాషత్వం స్పూర్తితో, ఈ సదస్సు స్పానిష్ మరియు ఇంగ్లీషులతో ద్విభాషగా ఉంటుంది. ప్రధాన కార్యక్రమాలకి వెనువెంటనే అనువాదం కూడా ఉంటుంది. బ్యూనోస్ ఏరీస్ లోని పర్యాటక కేంద్రంలో ఉండి అర్జెంటీనాలోనే అత్యంత ప్రముఖమైన "సెంట్రో కల్చరల్ జనరల్ సాన్ మార్టిన్" (జనరల్ సాన్ మార్టిన్ సాంస్కృతిక కేంద్రం, CCGSM) ఈ సదస్సుకి వేదిక. వికీమేనియా అనేది అన్ని వికీమీడియా ఫౌండేషన్ ప్రాజెక్టులలో పాల్గొనేవారిని ఉద్దేశించిన వార్షిక సదస్సు. ఈ సదస్సు వల్ల ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న స్వేచ్ఛా విజ్ఞాన చేపట్టులు మరియు సమిష్టి ప్రాజెక్టుల గురించి వికీ సమాజం మరియు సాధారణ ప్రజలు తెలుసుకుంటారు. గతంలో ఈ సదస్సులు ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ), బోస్టన్ (అమెరికా), తైపీ (తైవాన్) మరియు అలెగ్జాండ్రియా (ఈజిప్ట్) లలో జరిగాయి. వివిధ ప్రాజెక్టులలో అకడెమిక్ దృక్పథంపై ప్రత్యేక శ్రద్ధతో జరగబోయే వికీమేనియా 2009 సదస్సుకి ప్రముఖ వికీమీడియా మరియు స్వేచ్ఛా సంస్కృతి ప్రతినిధులు హాజరవుతారు. అన్ని వికీ ప్రాజెక్టుల వలెనే (ఈ సైటు కూడా ఒక వికీ), ఇది కూడా ఒక నిరంతరం వికాస ప్రక్రియ. సదస్సు తేదీ సమీపించేకొద్దీ, ఇక్కడి సమాచారం మెరుగవుతూ, విస్తరిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్య విభాగాలలో ప్రాధమిక సమాచారం ఉండేందుకు ప్రస్తుతం ఔత్సాహికులు తోడ్పడుతున్నారు. వీలువెంబడి తాత్కాలిక షెడ్యూలు ప్రచురించబడుతుంది. సదస్సు భాషపై సందేహాలున్నాయా? తరచూ అడిగే ప్రశ్నలని చూడండి |